నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చందంపేట మండలం, చింత్రియాల గ్రామానికి చెందిన మంగళగిరి భారతమ్మ ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 8 ఏళ్లగా తన మట్టి ఇల్లు కూలిపోయి ఇబ్బందులు పడుతున్నానని, అయినప్పటికీ ప్రభుత్వం తనకు ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్, జిల్లా కలెక్టర్ స్పందించి తనకు ఇల్లు మంజూరు చేయాలని భారతమ్మ కోరారు.