గంగవరం: మండలం కేంద్రం నందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వ్యాయామ టీచర్లు ఆజిద్ రమణ మాట్లాడుతూ, మన జాతీయ క్రీడ అయినటువంటి హాకీ కి వన్నె తెచ్చిన వ్యక్తి ధ్యాన్ చంద్, ఆయన పుట్టినరోజు క్రీడా దినోత్సవం గా జరుపుకుంటున్నాం. మొబైల్ కి అలవాటైపోయిన సమాజాన్ని మళ్లీ తిరిగి ఆరోగ్యవంతమైనరీతిలో తీర్చి దిద్దాలని క్రీడా మైదానాలకు దగ్గర అవ్వాలని ధ్యాన్చంద్ ఆశయాలని తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో 250 మంది స్టూడెంట్స్ తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.