ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారంమధ్యాహ్నం 1గంటలకి మంచిర్యాలలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న బీహార్ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందనే ఆక్రోషంతో రాహుల్ అనుచిత వ్యాఖ్యలకు పూనుకున్నారని ఆరోపించారు. వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.