రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం,రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎలగందుల లావణ్య అనే మహిళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలకు భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.