సదాశివనగర్ మండలం జ్యోతి నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మి(40) సంవత్సరాలు భార్యని మద్యం మత్తుతో భర్త రవి హతమార్చాడు. శుక్రవారం రాత్రి రవి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో ఆవేశంలో భర్త రవి రాయితో భార్య లక్ష్మి పై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు శనివారం విచారణ జరిపి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఒకసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.