మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వడ్డేపల్లి రాంబాబు (38)పెద్దవంగరలో పురుగుల మందు తాగి ఆటోలో స్పృహ తప్పి పడిపోయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం 12:00 లకు వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రాంబాబుకు ప్రథమ చికిత్స అందించి తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది చర్యల వల్ల రాంబాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.