కళ్యాణదుర్గం పార్వతి నగర్ కి చెందిన సివిల్ సప్లై గోడౌన్ హమాలి గోవిందు కుమారుడు అనిల్ కుమార్ డీఎస్సీలో సత్తా చాటి స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యాడు. స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 87.5 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నాలుగో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సీఐటీయూ, హమాలీ సంఘం సభ్యులు స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన అనిల్ కుమార్ ను సన్మానించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.