వెలిగండ్ల మండలంలోని నాగిరెడ్డిపల్లె గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో మహబూబ్ బాషా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. సచివాలయ సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావాలని, విధులకు డుమ్మా కొట్టే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవినీతి రహితంగా సచివాలయాల్లో సిబ్బంది విధులు నిర్వహించాలని, ఎక్కువ రోజులు సచివాలయం చుట్టూ ప్రజలను తిప్పుకోకుండా నిర్దిష్ట కాల పరిమితిలో వారి సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఎంపీడీవో ఆదేశించారు.