కడప మండల పరిధిలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 30వ తేదీ ఎంఆర్సిని ముట్టడిస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కడప ఆర్జెడి గారికి తెలియజేయడం జరిగింది.సోమవారం సాయంత్రం ఆర్జెడి కార్యాలయంలో ఆర్జేడి శామ్యూల్ గారిని కలిసి కడప మండల గత ఎంఈఓ వైఖరి పై ఫిర్యాదు చేయడం జరిగింది. మండలంలోని దాదాపు నాలుగు వందల పైబడి ఉపాధ్యాయుల ఇన్కమ్ టాక్స్ కు సంబంధించి టీడీఎస్ నాలుగు త్రైమాసికాలు పెండింగ్లోనే ఉండడం వలన ప్రస్తుతం ఉపాధ్యాయులు ఈ ఫైలింగ్ చేసుకోవడానికి అవకాశం లేకపోయిందన్నారు.