షీలానగర్ ఏరియా ఇంటిలో జరిగిన గ్రేవ్ దొంగతనంకేసును, విజయ దుర్గ పొలిమేర్స్ కంపెనీ Owner ఇంట్లో జరిగిన దొంగతనం కేసును అదునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి త్వరితగతిన ఛేదించమని DCP లతా మాధురి మీడియాకు గురువారం తెలిపారు.ఈ కేసులో ముగ్గురు నిందితులు చిటికెల నాగేశ్వరరావు @ నాగేశ్ (34), A2. అర్జున జ్ఞాన ప్రకాశ్ (26) మరియు A3. లింగిబెడి రాంబాబు (30) ను అరెస్టు చేసి, దొంగిలించిన 100 తులాల బంగారు ఆభరణాలు లో 72 తులాల బంగారు ఆభరణాలను మరియు దొంగిలించిన కాష్ 13.5 లక్షలు లో కాష్ Rs.9,04,200/- ను స్వాధీనం చేసుకున్నారు.