యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు ఎం మండల కేంద్రం నుండి మొరిపాల గ్రామం మధ్యలో భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న బిక్కేరు వాగును జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. లో లెవెల్ కాజ్వే పైనుండి బిక్కేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుందని, ప్రజలు ఎవరు వాగు దాటడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ప్రజలు వాగు దాటకుండా ఇరువైపులా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని డీసీపీకి సూచనలు చేశారు.