జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ లో యూరియా బస్తాల కోసం శనివారం రైతులు తిప్పలు పడుతున్నారు. సహకార సంఘం గోదాం వద్దకు యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకున్న రైతులు అక్కడ బారులు తీరారు. గోదాంలో 200 బస్తాలు మాత్రమే ఉన్నాయని అధికారులు తెలపడంతో సుమారు 500 మంది రైతులు నిరీక్షించారు. యూరియా బస్తాల కోసం క్యూలో ఆధార్ కార్డులు, పాస్ బుక్ జిరాక్స్ ఉంచారు. పలువురికి యూరియా దొరకపోవడంతో నిరాశకు గురయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు యూరియా అందే విధంగా చూడాలని రైతన్నలు వేడుకుంటున్నారు.