ఫర్టిలైజర్ దుకాణదారులు రైతులకు అధిక ధరలతో ఎరువులను విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవని బెలుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం మండల వ్యవసాయ అధికారి పృద్వి సాగర్, పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రామదాసులతో కలిసి మండల కేంద్రంలోని గురు శ్రీ ఫర్టిలైజర్స్ మరియు మన గ్రోమోర్ ఎరువుల దుకాణాలను తహసిల్దార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ప్రకటించిన ధరలతో ఎరువులను విక్రయించాలని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా అధిక ధరల అమ్మకం చేపడితే లైసెన్సులు రద్దు చేయబడతాయన్నారు.