వికలాంగులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చేయడం అన్యాయమని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 80వేల మంది వికలాంగుల పెన్షన్లు రద్దు చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం అన్యాయమన్నారు. నూతన పెన్షన్లు మంజూరు చేయకుండా పాత పెన్షన్లు రద్దు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వికలాంగులకు YCP అండగా ఉంటుందన్నారు.