జిల్లా కార్యాలయంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత పరికరాలు మరియు ఉపకరణాల నిర్ధారణ శిబిరం యొక్క బ్రోచర్‌ను గురువారం ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 సంవత్సరాల లోపు దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల పరికరాలు, ఉపకరణాలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలు జిల్లా సమగ్ర శిక్ష (TSS), భారత కృత్రిమ అవయవాలు మరియు ఉపకరణాల సంస్థ (ALIMCO) ఆధ్వర్యంలో నిర్వహించబడనున్నాయని అన్నారు.