అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ శుక్రవారం వినాయక నిమజ్జన వేడుకలు జరిగాయి. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, సీఐలు సాయిప్రసాద్, శివగంగాధర్ రెడ్డి, ఎస్ఐ ధరణిబాబు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలైన ఆలూరు, చిన్న పొలమడ, సజ్జలదిన్నె గ్రామాల్లో స్వయంగా ఏఎస్పీ బందోబస్తు పర్యవేక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని గ్రామస్తులకు సూచించారు.