శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది.ఆదివారం తెల్లవారుజామున పాతాళగంగ సమీపంలోని ఇళ్ల వద్ద చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో ఆ తర్వాత అది పంప్ హౌస్ వైపు పారిపోయింది. ఈ ఘటనతో పాతాళగంగ వాసులు ఆందోళనలో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.