ఆదివాసి గిరిజన గ్రామాలలోని పిహెచ్సిలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు మీ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల వసతి గృహాలతో పాటు అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తప్పనిసరిగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు. మంగళవారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో మెడికల్ ఆఫీసర్లు మరియు సబ్ యూనిట్ అధికారులతో వర్షాకాలంలో ప్రభలే వ్యాధులు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.