అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో దోమల నివారణకు క్రిమి సంహారక మందుల పిచికారి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి శనివారం పేర్కొన్నారు. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామంలోని కాలనీలో సాయంత్రం సమయంలో మలాథియాన్ క్రిమిసంహారక ద్రావణాన్ని గ్రామంలో పిచికారీ చేయించి ఇంటింటా సైతం పిచికారి చేయించారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకొని వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత, డైడే పాటించాలని అవగాహన కల్పించారు.