నల్లగొండ జిల్లాలోని రైతులకు అవసరమైన యూరియాను వెంటనే అందుబాటులో ఉంచి పంటలను కాపాడాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున సోమవారం డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్రం రాష్ట్రానికి సరైన యూరియా సరఫరా చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నెల రోజులుగా నాట్లు వేసిన రైతులు యూరియా దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.