అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ లో ఇంటి ముందు నిలిపి ఉంచిన యమహా బైక్ ను గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితుడు అబ్దుల్ బాసిత్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అయ్యప్ప స్వామి స్కూల్ వద్ద అబ్దుల్ బాసిత్ నివాసం ఉంటున్నాడు. గత రాత్రి నలుపు రంగు యమహా RX-135 బైక్ లో బయటకు వెళ్ళి వచ్చి ఇంటి ముందు నిలిపి ఉంచాడు. అయితే బుధవారం వేకువజామున 3 గంటల 41 నిమిషాలు సమయంలో తాళం వేసి ఇంటి బయట నిలిపి ఉంచిన తన ద్విచక్రవాహనాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. బైక్ కు చైన్ వేసినప్పటికీ వాటిని పగులగొట్టి బైక్ ను దొంగ ఎత్తుకెల్లాడు.