వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఓ అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లిలోని బాలయ్య దంపతులకు నూతన వస్త్రాలు అందించి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సర్ప్రైజ్ చేశారు.ఎన్నికల్లో భాగంగా కూరగాయలమ్మే బాలయ్య నిత్యం తన బండికి మైక్ పెట్టుకొని ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రచారం చేశారు.ఎమ్మెల్యే అయిన తర్వాత అభిమానిని గుర్తుంచుకొని ఇంటికి వెళ్ళారు.నూతన వస్త్రాలను అందించి,వారితో ఆప్యాయంగా మాట్లాడారు.ఎన్నికల ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుంచుకొని తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని కూరగాయల అమ్మే బాలయ్య బుధవారం తెలిపారు.