జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెం డిఎస్పి రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం ఏరియా కు చెందిన పల్లంట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో 23 ద్విచక్ర వాహనాలను దొంగలించి జంగారెడ్డిగూడెం ఊరు చివర బైనరు వంతెన వద్ద పొదలలో దాచి ఉంచగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆ ద్విచక్ర వాహనాలను స్వాధీనం పరుచుకున్నాం. స్వాధీనా పరుచుకున్న సొత్తు విలువ సుమారు పది లక్షలు.