అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో ఆదివారం 4:30 గంటల సమయంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి లోక కళ్యాణదుర్గం కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాణా అధికారి బాబు ఆలయ ప్రధాన పూజారి సీతా రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ శ్రీవల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శుద్ధ షష్టి సందర్భంగా కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందని అదేవిధంగా భక్తులందరికీ అన్నదానాన్ని కూడా నిర్వహించామని ఆలయ కార్యనిర్వాన అధికారి బాబు ఆలయ ప్రధాన పూజా రామ్మోహన్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోభక్తులు స్వామిని దర్శించుకున్నారు.