కడప జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కడప నగరం రాధాకృష్ణ నగర్ లోని బాలుర సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నెంబర్ 3 విద్యార్థులకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా 'ఈగల్' బృందం, మరియు నార్కోటిక్ బృందము స్థానిక 1 టౌన్ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.