నగరంలోని గణపతుల బావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులతో కలిసి నిమ్మజన ఏర్పాట్ల విషయమై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీ.పీ సాయి చైతన్య సమాలోచనలు జరిపారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్, అధికారులకు సూచించారు.ప్రధానంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు.