జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలోని గంగనర్సయ్య అనే రైతుకు చెందిన గేదె గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. గంగ నర్సయ్య తన గేదెను పొలంలో మేత కోసం తీసుకువెళ్లాడు. గేదె మేత మేస్తూ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి తాకి షాక్కు గురైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాధితుడిని ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.