గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే ఆదివాసి గిరిజనులు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి అన్ని గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు.సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి,తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపించారు..