సిరిసిల్ల పట్టణంలో ప్రధాన వీధుల గుండా సాగుతున్న గణేష్ శోభాయాత్రలను పోలీసులు పట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలు నిమజ్జన ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగగా ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు ఇతర ఇబ్బందులు తలెత్తినట్లయితే వెంటనే వైర్లెస్ చెట్ల ద్వారా పోలీసులు సూచనలు చేస్తూ తక్షణ చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణ కోసం భద్రత ఏర్పాటు చేసి శోభాయాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టారు.