రంగారెడ్డి, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి అక్రమ మద్యం, బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్లో 125 మద్యం సీసాలు, ముషీరాబాద్లో జానీ వాకర్ బాటిళ్లు పట్టుకున్నారు. అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే 2,010 కిలోల బెల్లాన్ని కూడా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు