హింసాత్మకమైన టీవీ సీరియల్స్ కు మహిళలు ప్రభావితం అవుతున్నారని, తద్వారా మహిళలు సైతం హత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు. అలాంటి టీవీ సీరియల్స్ ను నిలిపివేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ టీవీ సీరియల్స్ ప్రాణాలు తీస్తున్నాయన్నారు. మహబుబ్ నగర్లో ఓ గ్రామంలో రైతు కుటుంబం టీవీ సీరియల్ ద్వారానే అఘాయిత్యానికి పాల్పడిందన్నారు.