వర్ధన్నపేట మండలం బండవతాపురంలో తెగిపోయిన కట్టివ కాలువను బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా కటకాల్వ మరమత్తు పనులు చేపట్టి కాలువ పునరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కథ కాలువ ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పనుల పురోగతిని ఎప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పర్యవేక్షించాలన్నారు.