పలమనేరు: పట్టణంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసిన సంగతి విధితమే. పలమనేరు ఏరియా ఆసుపత్రి వద్ద ఎఫ్ ఆర్ ఓ నారాయణ తెలిపిన సమాచారం మేరకు. విజయలక్ష్మి చౌల్ట్రీ వద్ద ఒంటరి ఏనుగును అడవిలోకి తరిమే క్రమంలో హఠాత్తుగా ఎఫ్ఎస్ఓ సుకుమార్ పై ఒంటరి ఏనుగు దాడి చేసింది. ఆయనకు కాలు చెయ్యి ఫ్రాక్చర్ అవడంతో హుటాహుటిన పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలిస్తామన్నారు. ప్రత్యక్ష సాక్షి భాను సంఘటన గురించి వివరించారు.