ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ బాపట్ల జిల్లా నగరం ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదు చేసిన కేసుల వివరాలను సీఐ శ్రీరాం ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏ4 షాపులను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఎంఆర్పి మరియు టైమింగ్ ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలని, అందరూ తప్పనిసరిగా ఏ4 షాపు నియమాలను పాటించాలని సిఐను ఆదేశించారు.