ఎరువులు కొరతపై రైతులకు బాసటగా వైసిపి "అన్నదాత పోరు" కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ నిరసనకు ఎటువంటి అనుమతులు లేవని, ప్రభుత్వం ఆంక్షలు విధించి జిల్లా వ్యాప్తంగా వైకాపా నాయకులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు పోలీసులు చేస్తున్నారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తామంటే బయటకు రాకుండా చేయడం అన్యాయమని ధర్మాన ప్రసాద్ రావు మండిపడ్డారు.