ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి వారు తయారుచేసిన బోధన అభ్యసన ఉపకరణాల(టీఎల్ఎం) మేళాలు అద్ధం పడతాయని జిల్లా విద్యాధికారి ఎల్లెంకి శ్రీనివాస రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి బోధనా అభ్యసన ఉపకరణాల మేళాను డీఈవో శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనోపకరణాలు విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయని చెప్పారు. బోధనోపకరణాలను తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా వినియోగించి పాఠ్యాంశాలను బోధించాలని సూచించారు. జిల్లాలోని ఉపాధ్