Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: విద్య రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Mancherial, Mancherial | Sep 9, 2025
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం సకల సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం భీమారం మండలంలోని కాజీపల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు పట్టిక, మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us