నరసరావుపేటలో మురుగు రోడ్ల సమస్యపై మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు.ఆదివారం మీడియాతో మాట్లాడుతూ MLAలు వచ్చి స్వచ్స్ ఆంధ్ర, క్లీన్ అండ్ గ్రీన్ నరసరావుపేట అంటూ కేవలం ప్రచారాలు మాత్రమే చేస్తున్నారని, మురుగు రోడ్ల సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. 7వ వార్డులో గత నెల రోజులుగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేవారు లేరని, దీనివల్ల దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.