ద్విచక్ర వాహనం నడిపే వారే కాకుండా వెనక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఆయన శనివారం రాత్రి పట్టణంలో వాహనాల తనిఖీ చేపట్టి హెల్మెట్ ధరించని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ ధారణ ఆవశ్యకతను వారికి వివరించారు. ఆపద సమయాల్లో ప్రాణాలు నిలిపేది హెల్మెట్ మాత్రమేనని ఆయన ఉద్ఘాటించారు.