బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ మనోజ్ ఆలయ కమిటీ మెంబర్స్. భక్తులకు సబ్ కలెక్టర్ విగ్రహాలను పంపిణి చేసారు. ఆలయ అర్చకులు సతీష్ శర్మ మంత్రోచ్చారణ చేసి మట్టి విగ్రహాల ప్రాధాన్యతను తెలియజేయడం జరిగింది. పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను పెట్టాలని అన్నారు.