గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ముఖ్య కూడలి లలో పోలీస్ శాఖ తరపున సీసీ కెమెరాలు గురువారం మధ్యాహ్నం గంట్యాడ ఎస్ ఐ సాయి కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ తరపున కొటార్ బిల్లి జంక్షన్, కొత్త వెలగాడ జంక్షన్, మదనాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ జంక్షన్, తాడిపూడి పోలీస్ అవుట్ పోస్టు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో కొర్లాం జంక్షన్ కొన్న తామరపల్లి డాబా వద్ద సీసీ కెమెరాలు పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. నేరాల నియంత్రణ లక్ష్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ సాయికృష్ణ తెలిపారు.