కల్లూరు మండలం పెద్దపాడు సమీపంలోని పవన్ సాయి నగర్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలకల్లు వెంకటేశ్వర రెడ్డి, అరుణమ్మ దంపతులు ఏపీ 39 ఆర్ఎస్ 4606 నెంబర్ గల బైక్ పై వెళ్తుండగా ఏపీ 39 ఎంఎన్ 7875 నెంబర్ గల కారు ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న ఆయన భార్య వెంకటేశ్వర రెడ్డి భార్య అరుణమ్మ స్పాట్లోనే మృతిచెందగా, వెంకటేశ్వర రెడ్డికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.