సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం పాతపాలెం గుంతపల్లి గ్రామాల మధ్య సోమవారం 4:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టి వెళ్లిపోయిన సంఘటన చోటుచేసుకుంది పాతపాలెం గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు కొండపల్లికి చెందిన బండి నరసింహులు మరొక వ్యక్తి వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం జరిగిందని ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి కాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావం కావడం జరిగిందని మరొక వ్యక్తి కూడా తీవ్ర గాయాలు తగలడం జరిగిందని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగిందని పాతపాలెం గ్రామస్తులు పేర్కొన్నారు.