జిల్లాలో ప్రధాన ఉపాధి వనరుల ఖిల్లాగా కొప్పర్తి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ హబ్ వెలుగొందుతోందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొరత లేదని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం కొప్పర్తి లోని దాదాపు 600 ఎకరాల్లో ఏర్పాటైన మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తోకలిసి పరిశీలించారు. సెప్టెంబర్ 2న రాష్ట్ర విద్యాశాఖ, ఐటి శాఖామంత్రి జిల్లాలో పర్యటించనున్న సందర్బంగా పరిశీలించారు.