మోతాదుకు మించి రానున్న 72 గంటల పాటు వర్ష ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున, మంగళవారం హైదరాబాద్ నుండి భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన వరద నియంత్రణ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసుకొని భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు స