అన్నదాతలకు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎండలో గంటల తరబడి బారులు తీరాల్సిన దుస్థితి నెలకొందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు తెలిపారు. ఆదివారం భట్టిప్రోలు మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద క్యూ లైన్ లో ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను అశోక్ బాబు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ శాతం కౌలు రైతులే లైన్ లో ఉండటంతో, ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ అధికారులు సరిపడా యూరియాను రైతులకు అందించాలని ఆయన కోరారు.