కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఓ బాలుడు బావిలో వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. రాయికల్ లో వెంకటయ్య, కావ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు, 18 నెలల కుమారుడు కౌశిక్ నంద బాలుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం పడిపోయాడు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు బావిలో ఎంత వెతికిన లభించకపోవడంతో, పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు చేరుకొని నిన్నటి నుంచి అవిలో గాలిస్తున్న బాలుడి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మృతదేహం లభించింది. కౌశిక్ నంద మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.