ఓర్వకల్లు మండలం నన్నూరులో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఆదివారం హైవేపై అతివేగంతో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టి, డివైడర్ పైకి వెళ్లి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఒకవేళ బస్సు రోడ్డు డివైడర్ ను దాటి అవతలి వైపుకు వెళ్లి ఉంటే ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించేదని తెలిపారు.