మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి పండుగను జరుపుకుని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డాక్టర్ గుండు గంగాధర్ విజ్ఞప్తి చేశారు . కాకినాడ జిల్లా పిఠాపురం జై గణేష్ ఆలయం వద్ద సోమవారం సాయంత్రం 4 గంటలకు విజయ ఆర్థో అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.సందర్భంగా డాక్టర్ గంగాధర్ మీడియాతో మాట్లాడారు