సాలూర శివారులోని మంజీర నది రాతి వంతెన మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శవం చుట్టూ బండరాళ్లు ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది నిమగ్నమై ఉండటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.